Leading News Portal in Telugu

Bath: పగలు కుదరడం లేదని రాత్రుళ్లు స్నానం చేస్తున్నారా? అయితే ప్రమాదమే



Head Bath

Are you Doing bath On Night times: చాలా మందికి రెండు పూటల స్నానం చేసే అలవాటు ఉంటుంది. కొంతమంది ఉదయం పూట కుదరక రాత్రి పూట స్నానం చేస్తూ ఉంటాయి. అయితే అలా రాత్రి పూట స్నానం చేయడం అంత మంచిది కాదంట. రాత్రి సమయంలో స్నానం చేయడం అంటే కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే. అసలు ఇది శారీరానికి ఏవిధంగా హాని చేస్తుందో చూద్దాం. సహజంగా రాత్రి సమయంలో శరీర ఉష్ట్రోగ్రత తగ్గుతుంది. ఈ కారణంగానే మెదడులో నిద్రకు సంబంధించిన సైకిల్ యాక్టివేట్ అయ్యి నిద్ర వస్తుంది. కానీ రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ట్రోగ్రత పెరుగుతుంది దీని వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. మంచి నిద్రను పోలేము.

Also read: Apple IPhone 15: ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే ఆపిల్‎కు రూ.4 లక్షల కోట్ల నష్టం.. ఎలాగో తెలుసుకోండి

రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె కొట్టుకునే వేగం ఎక్కువ అవుతుంది. ఇది అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. అందకే స్నానం చేయాలనిపిస్తే గుండె కొట్టుకునే రెండు గంటల ముందు చేయాలి. రాత్రి సమయంలో సాధారణ స్నానం చేస్తే కలిగే నష్టాల కన్నా, తల స్నానం చేస్తే ఎక్కువగా సమస్యలు వస్తాయి. రాత్రి తల స్నానం తరువాత జుట్టు సరిగా ఆరకముందే నిద్రపోతూ ఉంటాం. దీని వల్ల సైనస్ లాంటివి, తల నొప్పి లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తలలో బ్యాక్టీరియాలు కూడా ఈ తడి కారణంగా పెరుగుతాయి. ఇక మరోసమస్య ఏంటంటే మనలో చాలా మంది రాత్రి తిన్నాకా తీరికగా స్నానం చేస్తూ ఉంటారు. దీని వల్ల ఆహారం జీర్ణం అవడం కష్టంగా మారుతుంది. ఈ ప్రభావం మన జీర్ణ క్రియ మీద పడుతుంది. దీని వల్ల ఉదర సంబంధ రోగాలు వస్తూ ఉంటాయి. అందుకే వీలైనంత వరకు తీరిక ఉన్నా లేకపోయినా పగటి పూట స్నానం చేస్తేనే మంచిది.