Leading News Portal in Telugu

Health Tips : 25 ఏళ్లు దాటిన అమ్మాయిలు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..


ఆడపిల్లలు టీనేజ్ తర్వాత మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.. ఇక యుక్త వయస్సులో అంటే 25 ఏళ్ల వయస్సులో చదువు, వృత్తి, వివాహం మొదలైనవన్నీ వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారతాయి.. ఈవయస్సులో అమ్మాయిలు చదువులు, ఉద్యోగాలు అని బిజీ లైఫ్ ను గడుపుతుంటారు.. ఈ వయసులో అమ్మాయిల ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎనర్జిటిక్‌గా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. పీరియడ్స్, మూడ్ స్వింగ్స్ నుంచి కూడా రక్షిస్తుంది. అమ్మాయిల ఆరోగ్యం పదిలంగా కాపాడుకోవడానికి 25 ఏళ్ల తర్వాత ఏయే ఆహారం తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

*. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సగానికి పైగా వ్యాధులు జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్లనే వస్తాయి. చాలా మంది పచ్చి కూరగాయలు లేదా సలాడ్ తినడం ఇష్టపడరు. అయితే మీ ఆరోగ్యం బాగుండాలంటే పచ్చి కూరగాయలను తప్పకుండా తినండి. ఆడపిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఫైబర్ వీటిలో చాలా ఉంటాయి..

*. యుక్త వయస్సు అమ్మాయిలకు ఐరన్ చాలా అవసరం.. పీరియడ్స్ వస్తుంటాయి..ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. బీట్‌రూట్, ఉసిరి, పాలకూర, దానిమ్మ వంటి వాటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది..
*. ఇకపోతే కార్బోహైడ్రేట్లు శక్తిని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్త్రీలలో కండరాల కంటే కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగానే వారు బరువు త్వరగా పెరుగుతారు. శారీరక శ్రమ చేసేవారిలో కొవ్వు వేగంగా పెరగదు. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి కాంప్లెక్స్ పిండి పదార్థాలు తీసుకోవాలి. కాంప్లెక్స్ పిండి పదార్ధాలు తృణధాన్యాలు, వోట్స్, హోల్ వీట్ పాస్తాలో ఇవి పుష్కలంగా ఉంటాయి..

*. శరీరం పెరుగుదలకు ప్రోటీన్స్ చాలా అవసరం.. జుట్టు, గోళ్ల పెరుగుదలలో ప్రోటీన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆడపిల్లలు ప్రొటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. మాంసకృత్తులు తినడం వల్ల ఎముకల పటుత్వం పెరగడంతో పాటు శరీరానికి బలం చేకూరుతుంది. గుడ్లు, చీజ్, చికెన్, కాయధాన్యాలు, సోయా ముక్కలు మొదలైనవాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి..
*. ఇక చివరగా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి.. సాల్మన్ ఫిష్, బాదం, వాల్‌నట్స్, ఇతర నట్స్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్‌లో అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల శరీరంలో సెరొటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది మనసు సంతోషంగా ఉండేలా చేస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఎముకలు దృడంగా ఉండేందుకు సహాయపడతాయి..