Leading News Portal in Telugu

Sleep :ఏ వయస్సు వాళ్లు ఎన్ని గంటలు నిదరించాలో తెలుసా?


మన శరీరానికి అన్నం, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే అవసరం.. మన శరీరానికి తగినంత నిద్ర ఉన్నప్పుడే మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. మనం నిద్రించేటప్పుడు మన శరీరంలో అనేక విధులు జరుగుతాయి.. హాయిగా రాత్రుళ్ళు నిద్రపోతేనే అవయవాల పని తీరు బాగుంటుంది.. తర్వాత రోజు చురుగ్గా పనులు చెయ్యగలుగుతారు..అలాగే నిద్రించడం వల్ల మన శరీరం తనని తాను శుభ్రం చేసుకుంటుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. రోజూ తగినంత నిద్రించకపోవడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.. అయితే ఏ వయస్సు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

4 లేదా 5 గంటలు నిద్రిస్తూ ఉంటారు. కొందరు పిల్లలు కూడా చాలా తక్కువ సమయం నిద్రిస్తూ ఉంటారు. పిల్లలు తక్కువ సమయం నిద్రించడం వల్ల వారిలో ఎదుగుదల తక్కువగా ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు. కనుక పిల్లలు కూడా వారి వయసుకు తగినట్టు తగినంత సమయం నిద్రించడం చాలా అవసరం. మనలో చాలా మందికి ఎంత సమయం నిద్రించాలో కూడా తెలియదు. మనం మన వయసును బట్టి నిద్రించాల్సి ఉంటుంది.. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 3 నెలల శిశువు వరకు రోజూ 14 నుండి 17 గంటల సమయం వరకు నిద్రించాలి…

ఆ తర్వాత వయస్సున్న వారు అంటే 4 నెలల నుండి 11 నెలల పిల్లల వరకు రోజూ 12 – 15 గంటలు నిద్రపోవాలి. ఒక సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు రోజూ 11- 14 గంటలు నిద్రపోవాలి. ఇక నుండి 5 సంవత్సరాల పిల్లలకు రోజూ 10 నుండి 13 గంటల నిద్ర అవసరమవుతుంది. అలాగే 6 నుండి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 – 11 గంటలు నిద్రపోవాలి. ఒక 14 నుండి 17 సంవత్సరాల వారు 8 నుండి 10 గంటలు నిద్రపోవాలి. 18 – 25 సంవత్సరాల వారు రోజూ 7 – 9 గంటలు నిద్రపోవాలి. 26 నుండి 64 సంవత్సరాల వారు రోజూ 7 – 9 గంటలు నిద్రపోతే సరిపోతుంది.. ఆపైన ఉండే వాళ్లు 8 గంటల పాటు నిద్రపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇది గుర్తుంచుకోండి..