Leading News Portal in Telugu

Ghee face Pack: నెయ్యితో ఫేస్ ప్యాక్ ట్రై చేశారా? బోలెడులు ఉపయోగాలు


Ghee Pack: ముఖం కాంతివంతంగా మెరిసి పోవడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఏదో ఒక ఫేస్ ప్యాక్ లు, ఖరీదైన క్రీమ్ లు, సబ్బులు వాడుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం సహజంగా లభించే వాటితోనే అందంగా మారాలనుకుంటారు. సాధారణంగా తేనె, ఆలోవెరా, శనగపిండి, బీట్ రూట్, బియ్యం పిండి ప్యాక్ లు, బొప్పాయి, అరటి పండు లాంటివి పెడుతూ ఉంటారు. హోమ్ రెమెడీస్ తో ఆరోగ్యంగా ఉంటూ అందాన్ని కూడా పొందవచ్చు.

అయితే మీరు ఎప్పుడైనా నెయ్యి ప్యాక్ గురించి విన్నారా? అవును నెయ్యితో ప్యాక్ వేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖాన్ని అందంగా చేసేందుకు మెరిపించేందుకు నెయ్యి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనలో చాలా మందికి నెయ్యి వాసన కూడా పడదు. అయితే ఈ ప్యాక్ తోచాలా ప్రయోజనాలే ఉన్నాయి. నెయ్యిలో ఉండే ఔషధ గుణాలు సూర్యకాంతి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. చర్మం మెరిసేందుకు ఉపయోగపడతాయి. అయితే నెయ్యితో ప్యాక్ చేసుకోవడం చాలా సులభం. దీని కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ని దీనిలో వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని  పక్కన పెట్టుకొని.. ఒక సీసాలో భద్రపరచుకొని ఉదయం పూట ముఖానికి అప్లై చేయాలి. అలా చేసిన తరువాత అరగంట పాటు అలాగే ఉంచుకొని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చర్మం మెరవడమే కాకుండా శాశ్వతంగా నిగనిగలాడుతుంది కూడా. ఇంకెందుకు ఆలస్యం నేతి ప్యాక్ ను మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి.