Leading News Portal in Telugu

Weight Loss: మధ్యాహ్నం భోజనానికి ముందు దీన్ని తాగితే.. వెన్నలా కొవ్వు కరుగుతుంది..


మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పు వల్ల అధిక బరువు అనేది సులువుగా పెరుగుతున్నారు..అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఉబకాయంతో అవస్తలు పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని హేళన చేస్తున్నారా? బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిందా? మీరు ఎంత ప్రయత్నించినా మీకు స్థూలకాయం సమస్య తీరడం లేదా?.. మీకోసమే ఈ ఆయుర్వేద చిట్కా.. ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

దీన్ని మధ్యాహ్నం భోజనానికి ముందు దీన్ని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. నెల రోజుల వ్యవధిలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఇది మీ పొట్టలో అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలో ఉండే అధికమైన నీటిని తొలగించి శక్తిని పెంచుతుంది.. ఈ పానీయం ను ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు..

250 గ్రాముల ముల్లంగి

8 నిమ్మకాయలు

100 గ్రాముల అల్లం

6 టేబుల్ స్పూన్ల తేనె

4 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క

ఎలా తయారు చెయ్యాలంటే?

ముందుగా అల్లం, ముల్లంగిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. దాన్ని చిన్న ముక్కలుగా కోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి..దాల్చిన చెక్క, తేనె కలిపి మెత్తగా వచ్చేంత వరకూ మిక్సీ చేయండి. ఒక గాజు పాత్రలో ఈ మిశ్రమాన్ని తీసుకోండి. భోజనం ముందు 1 టీ స్పూన్ మిశ్రమాన్ని తీసుకోండి. డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగచ్చు. ఇలా 5 వారాలపాటు చేస్తే మీ పొట్టలో కొవ్వు కరిగి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.. ఎంత భారీ శరీరం అయిన వెంటనే బరువు తగ్గిపోతుంది.. మీరు ట్రై చేసి రిజల్ట్ ఏంటో చూడండి..