Leading News Portal in Telugu

Breakfast Food: ఉదయం ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకండి.. ఎందుకంటే?


రాత్రి తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేస్తారు.. రాత్రి అంతా దాదాపు 9 గంటల వరకు తినకుండా ఉంటారు.. దాంతో ఉదయం టిఫిన్స్ చేస్తారు.. ఉదయం తీసుకొనే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అందువల్ల ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ అసలు మానకూడదు. అలాగే కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోకూడదు. మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. దీని మీద పెద్దగా అవగాహన ఉండదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానకుండా తినాలని మనకి తెలుసు. అయితే ఉదయం తీసుకునే ఆహారంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఉదయం తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా మంది ఉదయం లేవగానే స్పైసీ ఆహారాలను తీసుకుంటారు అలా తీసుకోకూడదు. స్పైసీ ఆహారాలు తీసుకుంటే కడుపులో మంట ఏర్పడి కడుపునొప్పి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ జామ్ తింటూ ఉంటారు అలా తినడం వలన మెదడు పనితీరు తగ్గుతుంది.. ఇక అదే విధంగా డిప్రెషన్ మానసికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఉదయం లేవగానే పరగడుపున కాఫీ తాగుతూ ఉంటారు..

పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో కాఫీలు, టీలు తాగడం వల్ల కాఫీలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ శరీరానికి హాని చేస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎసిడిటి అల్సర్ గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం సమయంలో ఓట్స్, బాదం బొప్పాయి గుడ్లు పాలు వంటివి తీసుకోవచ్చు.. ఇక వీటన్నిటి కన్నా కూడా చాలా మంది పల్లెల్లో చద్దన్నం, పెరుగు వేసుకొని తింటారు. అది కూడా చాలా మంచిది.. ఆ రోజుల్లో వాళ్లు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి హెల్త్ సీక్రెట్ అదే.. అదండీ ఉదయం ఏది తిన్న అరుగుతుందిలే అని ఏది పడితే అది తినడం మంచిది కాదు.. ఇది గుర్తు పెట్టుకోండి..