చిలగడదుంపలు చాలా టేస్టీగా, తీయగా ఉంటాయి. అందుకే వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. అయితే, నిజానికి ఇవి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజకరమైనవి. చిలగడదుంపల్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.. వీటిని తింటే బరువు పెరిగిపోతామన్న భయం ఉండదు.. నిజానికి ఇవి మనం బరువు తగ్గడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. 100 గ్రాముల చిలగడదుంపల్లో 86 కేలరీలు ఉంటాయి.. అలాగే వీటిలో ప్రోటీన్, ఫైబర్ లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
చిలగడదుంపల్లో ఫైబర్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయని హెల్త్ స్పెషలిస్ట్ లు అంటున్నారు. అలాగే వీటిలో విటమిన్ బీ6 కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. ఇలాంటి చిలగడదుంపలను తింటే గుండెపోటు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చిలగడదుంపలు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చిలగడదుంపలను రోజూ తింటే ఎసీడీటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గిపోయే ఛాన్స్ ఉంది. చిలగడదుంపలు మన పొట్ట ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తాయి.
చిలగడదుంపలో విటమిన్-సీ కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే మన ఎముకలు, దంతాలను కూడా హెల్తీగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ చిలగడదుపంల్లో విటమిన్ ఎ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే మన కళ్లు.. కంటి సమస్యలను దూరం చేస్తాయి. చిలగడదుంపలను తింటే వృద్ధాప్యం వల్ల వచ్చే దృష్టి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉండదు.
అయితే, డయాబెటీస్ పేషెంట్లు కూడా ఈ చిలగడదుంపలను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండంతో పాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇవి డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. అయినా వీటిలో నేచురల్ షుగర్ ఉండటంతో మధుమేహులు వీటిని మోతాదులోనే తీసుకోవాలి. చిలగడదుంపల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మంపై ముడతలను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది.