జామ పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలిసిందే.. అయితే ఆరోగ్యం మాత్రమే కాదు మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చర్మం కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి నివారిస్తాయి. జామపండులోని యాంటీఆక్సిడెంట్లు.. ముడతలు, గీతలు పడకుండా నివారిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూద్దాం..
ఇది చర్మ కణాలను తేమనందిస్తుంది. మృదువైన చర్మం పొందడానికి జామ పండు ఫేస్‌ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. దీనికోసం అరకప్పు క్యారట్ ముక్కలు, ఒక జామ పండు తీసుకొని రెండూ కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో కావల్సిస్తే.. నీళ్లు యాడ్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి… మృదువైన మెరిసే చర్మం ను పొందవచ్చు..
జామకాయ చర్మ ఛాయను మెరుగుపరచడానికీ సహాయపడుతుంది. పండిన జామను మెత్తని గుజ్జుగా చేసి, గుడ్డు పచ్చసొనను యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌గా వేసుకోండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది..
మెరిసే చర్మం కోసం ఒక జామ పండును తీసుకొని గింజలు తొలగించి పెట్టుకోవాలి. దీంతో పాటు మరో రెండు జామ ఆకులను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల పాలు కూడా చేర్చి మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పేస్ట్‌లో అర టీస్పూన్ పాల పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా అప్త్లె చేసుకోవాలి.. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని చల్లని నీళ్లతో కడిగితే సరిపోతుంది.. నిగనిగలాడే చర్మం మీ సొంతం..
జామపండును ఇక స్కర్బ్ లాగా కూడా వాడొచ్చు.. ఇందుకోసం ఒక జామ పండు, రెండు జామ ఆకులను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఓట్‌మీల్ వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకొని సున్నితంగా రుద్దుకోవాలి. ఇలా చేస్తే మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఇలా పది నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి..ఇలా తరచూ చెయ్యడం వల్ల మొటిమలు, మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి..