వంట గదిలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలకలు.. వంటలకు రుచిని పెంచే యాలకులను చాలా రకాల వెరైటీలలో విరివిగా వాడతారు.. స్వీట్స్, స్పైసి ఫుడ్స్ లో వీటిని వాడుతారు.. యాలకలు రుచిని మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.. యాలకుల్లో విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యాలకులు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయో ఇక్కడ తెలుసుకుందాం…
మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగ పడతాయి.. చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. యాలకులను తినడం వల్ల ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఫలితంగా దుర్వాసన సమస్య తగ్గుతుంది. పంటి నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి యాలకులను తినవచ్చు. చిగుళ్ల వాపును తగ్గించడంలో కూడా యాలకులు సహాయపడతాయి..
వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతంగా పెరుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి యాలకులు మంచి ఎంపిక..రోజు రెండు చొప్పున తీసుకుంటే మంచిది ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఎప్పుడైనా కడుపు నిండుగా ఆహారం తినడం వల్ల అసౌకర్యంగా అనిపిస్తే, ఉపశమనం పొందడానికి యాలకుల నీళ్లను తాగితే సరి..
వీటిని రోజు ఒకటి తీసుకున్నా మంచిది ప్రయోజనాలు ఉన్నాయి.. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. అంటే శరీరంలోని హానికారక విషపదార్ధాలను బయటికి పంపిస్తాయి.. పురుషులకు స్పెర్మ్ కౌంట్ ను పెంచడానికి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది..