Leading News Portal in Telugu

Lifestyle : దంపతులు ఈ టిప్స్ ఫాలో అయితే అస్సలు గొడవలే రావు..


దంపతుల మధ్య గొడవలు రావడం కామన్.. కొన్నిసార్లు చిన్న గొడవలే పెద్దగా అయ్యి విడిపోయేలా చేస్తాయి.. అందుకే వివాహ బంధం ఒక సాగరం అంటారు.. ఎన్నో అటు పోట్లు వచ్చినా కూడా అలలు ఒడ్డుకు చేరతాయి.. అందుకే చిన్న చిన్న గొడవలకు సర్దుకు పోతే సంసారం సుఖంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రిలేషన్‌ని మరింత స్ట్రాంగ్‌గా చేయడానికి కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్రతి సమస్య గురించి బహిరంగంగానే చర్చించుకోవడం, శ్రద్ధ, ఒకరి భావాల పట్ల మరొకరికి గౌరవం, నమ్మకం పెంచుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య ప్రేమ, బంధం మరింత పెరుగుతాయి.. అలాంటి టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రోజూ కాస్తా రొమాంటిక్‌గా ఉండాలి. ఉదయాన్నే కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం ప్రేమ సంబంధంలో ప్రేమను పెంచుతుంది. ఎందుకంటే, శృంగార సమయంలో శరీరంలో హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది.. తన నుంచి ఇంకా కావాలి అని అనుకుంటారు అప్పుడు గొడవలు రావు..

మీరు రోజులో ఏదైనా సమయంలో మీ పార్టనర్‌తో కలిసి మాట్లాడండి. ఇందులో మీ ఆఫీస్ వర్క్స్ షేర్ చేసుకోవడం, జోక్స్ చెప్పుకోవడం, ఏదైనా ఇద్దరు మంచి విషయాలు, లేదా మీ ఫ్యూచర్ హ్యాపీ ప్లాన్స్ గురించి మాట్లాడండి. ఇలా చేస్తే మీ రిలేషన్‌ మరింత స్ట్రాంగ్ అవుతుంది..

ఆ రోజుల్లో భర్త తో కలిసి తినడం చేసేవారు అందుకే గొడవలు రావు.. కానీ ఇప్పుడు మాత్రం ఊరికే గొడవలు అవుతాయి.. రోజులో ఒక్కసారైనా మీ పార్టనర్‌తో కలిసి తినడం అలవాటు చేసుకోండి. అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే. తినేటప్పుడు హ్యాపీగా కబుర్లు చెప్పుకోండి. దీని వల్ల ఇద్దరు కూడా మానసికంగా కనెక్ట్ అవుతారు.. ఇలా చేస్తే ప్రేమ పెరుగుతుంది..

నిద్రలేవగానే తనకి గుడ్ మార్నింగ్ చెప్పడం, ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు బైబై చెప్పడం మర్చిపోవద్దు. దీని వల్ల మీ రిలేషన్‌ మరింత దగ్గరవుతుంది. ఇవి చూడ్డానికి చిన్నగానే అనిపిస్తాయి. కానీ, మీ మనసులో మరింత ప్రేమ, నమ్మకాన్ని పెంచుతాయి… వారితో ఇంకా గడపాలని అనుకుంటారు.. దంపతుల మధ్య శృంగారం అనేది చాలా ముఖ్యం… అది రోజు ఉండేలా చూసుకోవడం అలవాటు చేసుకోండి.. అదే బంధాన్ని మరింత రొమాంటిక్ గా మారుస్తుంది.. సో ఇవన్నీ మీరు ఫాలో మీ దాంపత్య జీవితం రొమాంటిక్ గా, సరదాగా ఉంటుంది..