ఎంతో మంది కిడ్నాల్లో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఓవర్ వెయిట్, మందులు, సప్లిమెంట్స్, ఎన్నో అనారోగ్య సమస్యల వల్ల కిడ్నిల్లో రాళ్లు వస్తుంటాయి. ఆ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయం వరకు మన మూత్ర మార్గంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే మూత్రపిండాల్లో రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టమైంది. ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.
ఆరోగ్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు నీళ్లను ఎక్కువగా తాగాలి.. నీళ్లు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. నీళ్లను ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కూడా కరిగిపోతాయి. అందుకే వీళ్లు రోజుకు కనీసం 2.5 లీటర్ల తాగాలి తెలియజేస్తున్నారు. అయితే, రోజుకు 10 గ్లాసుల నీటిని తాగాలంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. బెర్రీలు, చాక్లెట్, బచ్చలికూర, గోధుమ రవ్వ, గింజలు, దుంపలు, టీలాంటి ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తినొద్దని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఇవి మూత్రపిండాల్లో రాళ్లను మరింత పెంచుతాయి కాబట్టి.
ఇక, కాల్షియం ఒక పోషకం.. ఇది మన ఎముకలను, దంతాలను, కండరాలను బల పరుస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.. కిడ్నాలో రాళ్లు ఉన్నవారు ప్రోటీన్ ను మరీ ఎక్కువగా తీసుకోవద్దు.. ఎందుకంటే దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువ కాల్షియంను బయటకు విడుదల చేస్తాయి. దీంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ పేర్కొంది. మూత్రంలో ఉప్పు స్థాయిలు ఎక్కువగా ఉంటే కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మీరు రోజుకు ఉప్పును 1,500 నుంచి 2,000 మిల్లీగ్రాముల్లోనే తీసుకోవడం మంచిదంటున్నారు. మీ ఆహారంలో ఉప్పును వీలైనంత తక్కువగా చేర్చండి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..