ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు భాదపడుతున్న సమస్య మధుమేహం.. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే. కంట్రోల్ అవ్వకుంటే ప్రాణాలే పోతాయి. అంత ప్రమాదం ఈ వ్యాధి.. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారికి కొన్ని ఆహరపదార్థాలు సూపర్ ఫుడ్ అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
మధుమేహులకు మెంతికూర దివ్య ఔషధం అనడంలో సందేహం లేదు. రోజుకు గుప్పెడు మెంతికూర తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. మెంతికూర లో ఐరన్ పుష్కలంగా నిండి ఉంటుంది.. అలాగే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్.. ఇలా అనేక విలువైన పోషకాలు మెంతికూర ద్వారా పొందవచ్చు. అందుకే ప్రతిరోజు గుప్పెడు మెంతుకూరను తీసుకోవాలని ఆరోగ్యాన్ని నిపుణులు చెబుతున్నారు… నిత్యం మెంతుకూరను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయి.
మధుమేహం మీ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే నిత్యం మెంతికూరను తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది. రక్తహీనత పరార్ అవుతుంది.. అల్సర్, పేగు మంట సమస్యలు దూరం అవుతాయి. డెలివరీ అనంతరం రోజూ మెంతికూర తీసుకుంటే తల్లిపాలు ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. మరియు గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.. అందుకే నిత్యం దీన్ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇంకా ఎన్నో లాభలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..