Leading News Portal in Telugu

Jowar Laddu : ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం.. జొన్నలడ్డు తయారీ విధానం..


Health: ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అందించడం చాల ముఖ్యం. పౌష్ఠిక ఆహరం పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిరుధాన్యాలు అందించడం ద్వారా పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషక పదార్ధాలను పుష్కలంగా అందించవచ్చు. జొన్నల్లో క్యాల్షియం మరియు ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. కనుక ఎదిగే పిల్లల్లో ఎముక పుష్టికి మరియు రక్తం వృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఎనలేని శక్తిని అందిస్తూ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జొన్న లడ్డుని ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Carissa Fruit Benefits : వామ్మో.. వాక్కాయలతో ఇన్ని ఉపయోగాల..

జొన్నలడ్డు తయారీకి కావాల్సిన పదార్ధాలు:
జొన్న పిండి- 1 కప్పు
వేరుశనగ పప్పు- 1/4 కప్పు
ఎండు కొబ్బరి తురుము- 1/4 కప్పు
బెల్లం- 1కప్పు
యాలకలు పొడి – 1/2 టేబుల్ స్పూన్
నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- కొద్దిగా( ఆప్షనల్)

Read also:China: చైనా బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించుకుని మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టాలి. ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యిని వేసి కాస్త వేడయ్యాక అందులో జీడిపప్పుని వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో జొన్నపిండిని వేసి కలుపుతూ పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేవరకు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. అనంతరం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించుకున్న జొన్నపిండి, బెల్లం, కొబ్బరి తురుము, వేరుశనగ పప్పు, యాలకలు పొడి తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని లడ్డులు చుట్టుకోవాలి. ఒకవేళ మిశ్రమమం పొడిగా ఉండి లడ్డు రాకపోతే కాస్త నెయ్యి వేసి కలుపుకుని లడ్డులు చుట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుతో లడ్డులు గార్నిష్ చేసుకోవాలి. ఈ లడ్డులు వారం పదిరోజుల వరకు నిలవుంటాయి.