Ramaphalam: రామాఫలం ఈ పండు గురించి చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మనకి సీతాఫలం విరివిగా లభిస్తుంది. కానీ రామాఫలం అంత ఎక్కువగా దొరకదు. కానీ స్థానికంగా మార్కెట్లలో దొరుకుతుంది. ఈ రామాఫలం కూడా సీతాఫలం జాతికి చెందిన చెట్టు. కానీ సీతాఫలం కంటే రామ ఫలంలో ఫోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన రామాఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read also:PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి
రామఫలం చూడడానికి హృదయాకారంలో ఉంటుంది. అలానే పచ్చిగా ఉన్నప్పుడు లేత పచ్చ రంగులోను పూర్తిగా పండిన తర్వాత లేత ఎరుపు రంగులోను ఉంటుంది. రామాఫలం పండు రుచికి తియ్యగా ఉంటుంది. సీతాఫలం కంటే తక్కువ గింజలను కలిగి ఉంటుంది. రామాఫలం జ్యూస్ అలసటను దూరం చేస్తుంది. ఈ పండులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్ లోని పైరిడాక్సిన్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు ఈ పండు తినడం ద్వారా డయాబెటిస్ రాకుండా రక్షణ పొందవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. గుండె సమస్యలు తగ్గుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.