Beauty: అందంగా కనిపించడం అంత కష్టమైన విషయం కాదు. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే చాలు సులువుగా అందాన్ని పెంచుకోవచ్చు. అలా ఆరోగ్యాన్ని అందిస్తూ అందాన్ని పెంచే జ్యూస్ క్యారెట్ బీట్‌రూట్ జ్యూస్. క్యారెట్ లో బీటా కెరోటిన్ విటమిన్ A, B1, B2, B3, B6, C, E మరియు K మరియు నియాసిన్, ఫోలేట్, పాంతోతేనిక్ ఆమ్లం, భాస్వరం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మరియు సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలానే బీట్‌రూట్‌లో బీటైన్, A, C, B- కాంప్లెక్స్, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం మరియు రాగి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ సౌదర్యానికి కూడా ఉపయోగపడతాయి. రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల చర్మం మంచి రంగులో ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు అలానే తయారీ విధానం ఇప్పుడు చూదాం.
Read also:Health Tips: అందంగా కనిపించాలంటే.. పింక్ సాల్ట్ వాడండి
కావాల్సిన పదార్ధాలు: క్యారెట్-2, బీట్‌రూట్-1, అల్లం- చిన్న ముక్క, నిమ్మ రసం- 1 టేబుల్ స్పూన్, తేనే- 2 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా క్యారెట్ మరియు బీట్‌రూట్ ని శుభ్రంగా కడగాలి. ఇప్పుడు క్యారెట్ మరియు బీట్‌రూట్ ని పీల్ చేసి ముక్కలుగా కోసుకోవాలి(క్యారెట్ మరియు బీట్‌రూట్‌ఆర్గానిక్ అయితే తొక్క తియ్యనవసరంలేదు). తర్వాత ఆ ముక్కలని మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క, నిమ్మ రసం, తేనే కలిపి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జును వడకట్టాలి. ఇలా చేసినప్పుడు ఆ గుజ్జులోని జ్యూస్ మొత్తం కిందకి దిగుతుంది. ఆ జ్యూస్ ని ఒక జ్యూస్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే.