Leading News Portal in Telugu

Health Tips : వీటిని రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారా?


ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదొక అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.. ముఖ్యంగా అధిక బరువును తగ్గిందేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఈ ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భాధపడతారు.. అలాంటి వారికి నువ్వులు మంచి ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి నువ్వులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

నువ్వుల్లోని లిగ్నాన్స్ బరవు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లిగ్నాన్స్ హార్మోన్స్ పనితీరును మెరుగ్గా చేస్తాయి. కొవ్వు శోషణని తగ్గిస్తాయి. అలాగే నువ్వుల్లో ఉండే ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది.. దీనివల్ల అతిగా తినడం ఆపేస్తారు.. ఇక మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. జ్ఞాపకశక్తిని మెరుగ్గా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరుని బాగు చేస్తుంది..

ఈ నువ్వుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యాసిడ్స్ హృదయ స్పందన రేటుని తగ్గిస్తాయి. ట్రై గ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.. అంతేకాదు వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. జింక్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరానికి వ్యాధులతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది.. ఈరోజుల్లో జింక్ చాలా అవసరం..

నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారి ప్రేగు కదలికలని సులభం చేస్తుంది..ఇకపోతే ఈ నువ్వులను కూరల్లో వేసుకొని తీసుకోవచ్చు..రోస్ట్ చేసి సలాడ్స్, తృణధాన్యాల్లో కలిపి తినొచ్చు. అదే విధంగా, దోశ, ఇడ్లీల్లో, చట్నీల్లో కలిపి తీసుకోవచ్చు.. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది..ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, డయేరియాతో బాధపడతారు.
తలనొప్పికి కారణమవతుంది.కొంతమందికి నువ్వుల గింజలు అలర్జీకి కారణమవుతుంది.. గర్భవతులు అస్సలు తీసుకోకవడమే మంచిది..