Leading News Portal in Telugu

Coconut juice : కొబ్బరి జ్యూస్ తయారీ విధానం.. ఉపయోగాలు


Health: ఈ ప్రపంచంలో కల్తీ లేని ఆహరం ఏదైనా ఉంది అంటే అది కొబ్బరి కాయ. ఈ కొబ్బరి కాయ లోపల ఉండే నీరు, కొబ్బరి రుచిని అందించడమే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ఈ కొబ్బరితో రకరకాల ఆహార పదార్ధాలు తాయారు చేస్తుంటారు. అయితే కొబ్బరి తో జ్యూస్ కూడా చెయ్యొచ్చు. ఈ జ్యూస్ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాల ఉపయోగపడుతుంది. మరి కొబ్బరి జ్యూస్ వల్ల ఉపయోగాలు ఏంటి? తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరిలో విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము, పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణవ్యస్థను ఆరోగ్యాంగా ఉంచడంలో దోహద పడుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను నియంత్రిస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. అలానే ఈ జ్యూస్ నీరసాన్ని దూరం చేస్తుంది. చర్మం తాజాగా ఉంటుంది.

జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్ధాలు:
కొబ్బరి కాయ- 1
పంచదార- 1 టేబుల్ స్పూన్
తేనే- 3 టేబుల్ స్పూన్లు

తయారీ విద్ధానం:

ముందుగా కొబ్బరి కాయను పగలగొట్టి అందులోని కొబ్బరి నీళ్లను ఒక మిక్సీ జార్ లో కి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చెక్క నుండి కొబ్బరిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి కొబ్బరి నీళ్లు ఉన్న మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పంచదార మరియు తేనే వెయ్యాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇపుడు ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. వడకట్టగా వచ్చిన జ్యూస్ ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి.