అందరూ డబ్బులను పర్సులో పెట్టుకునే అలవాటు ఉండే ఉంటది. అంతవరకూ ఓకే.. కానీ ఆ పర్సును మనం వెనక ప్యాంట్ జేబులో పెట్టుకోవడం ముప్పు అని ఎవరికి తెలియదు. చాలామంది పర్సు లేదా వాలెట్‌ని మగవారు లేదా స్త్రీలు బాక్ పాకెట్లోనే పెట్టుకుంటుంటారు. ఐతే అలా పెట్టకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే.. ఆరోగ్య సమస్యలు వస్తాయని, ఓ ఏజ్ వచ్చేటప్పటికి సరిగా నడవలేక వంగిపోవడానికి కారణం కూడా ఇదే అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు. అంతేకాకుండా.. ఎక్కువసేపు ఇలా ప్యాంటు వెనక జేబులో పర్సు పెట్టుకోవడం వల్ల “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Nandamuri Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్..
పర్సు వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అని ఏంటంటే.. చాలా మంది మెడ, భుజాలు, వెన్ను సమస్యలను తరుచుగా ఎదుర్కొంటుంటారు. దీనికి కారణం పర్సుని వెనుక జేబులో పెట్టడమేనని అంటున్నారు. బరువైన వాలెట్‌ని తీసుకొచ్చి బ్యాక్ పాకెట్లో పెట్టడం వల్ల తెలియకుండా ఆ బరువు కారణంగా కొంత ఒత్తిడి కండరాలు, స్నాయువులపై పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఫలితంగా అది కాస్త దీర్ఘకాలిక కీళ్ల నొప్పికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. పర్సులో పెట్టుకునే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వోచ్చర్స్, ఆధార్ కార్డులని ఇలా ఎన్నో కార్డులు పెట్టుకోవడం ద్వారా బరువుగా మారిపోతుంది. దాన్ని మనం బ్యాక్ జేబులో పెట్టుకోవడం ద్వారా తుంటి ఎముకలోని కండరాలు, కీళ్లు ఒత్తడికి గరయ్యి ఒకవైపు ఒంగిపోతాయి. మనం ఎక్కువ బరువుని మోస్తే ఆటోమోటిక్గా ఒకవైపుకి వంగి నడుస్తాం. మనకు తెలియకుండాని మన నడక వంకర అయిపోతుంది. దీంతో వెన్ను, తుంటి, కాలు, భుజాలలో నొప్పి మొదలై అసౌకర్యంగా ఉంటుంది. బ్యాక్ సైడ్పెట్టే బరువు వెన్నుపూసపై గట్టి ప్రభావం చూపిస్తుంది.
Ayalaan : టీజర్ రన్నింగ్ టైం గురించి క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ఇప్పుడున్న కాలంలో అన్ని చోట్ల కార్డులను ఉపయోగించకుండా యాప్ ద్వారా లాయల్టీ పాయింట్లను ఉపయోగించేలా అనుమతిస్తున్నాయి. ఒకవేళ చాలా బిల్లులు కట్టేందుకు ఆయా కార్డులు పట్టికెళ్లాల్సి ఉంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుని కార్డులు తగ్గించే ప్రయత్నం చేయండి. పంచ్ కార్డ్‌లు, బిజినెస్ కార్డులు, రివార్డు కార్డ్‌లు తదితర ఎలాంటి కార్డులైన తీసుకుని వెళ్లడం తగ్గించేలా యత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు వాలెట్ లేదా పర్సులో కార్డుల సంఖ్య పరిమితిగా ఉండేట్టు చూసుకోండి. దానివల్ల బరువు తగ్గి వీపు, మెడ, భుజాలు, కాళ్లు సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.