ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. కేలరీలు తక్కువగా ఉండే ఆహారం శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే పోషకాలతో నిండి ఉంటుంది.. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు.. అయితే బచ్చలి కూరను తీసుకోవడంలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బచ్చలిలోని నీరు, ఇతర పానీయాలు హైడ్రేట్ గా ఉంచటానికి సహాయపడుతుంది. అదనపు H2O కోసం బచ్చలి కూరను భోజనం, స్నాక్స్‌లో కలిపి తీసుకోవచ్చు. బచ్చలికూరలో అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఇనుము,విటమిన్ ఎ, విటమిన్ సి,బీటాకెరాటిన్ విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఆకలిని అరికడుతుంది.. ఆకలి హార్మోన్ లను తగ్గిస్తుంది.. దాంతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది.. దాంతో సులువుగా బరువు తగ్గవచ్చు..
బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో కాల్షియం, మాంగనీస్ మరియు విటమిన్ కె ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడతాయి.. బచ్చలి శాఖాహారం. బలహీనంగా, తల తిరగడం , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిన వారు బచ్చలి కూర తినటం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు… అదే విధంగా ఇది టాక్సిన్స్ వంటి హాని కలిగించే వాటినుండి శరీరాన్ని రక్షిస్తుంది.శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతుంది. ఊపిరి తిత్తులకు బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. వృద్దాప్య ఛాయాలను తగ్గిస్తుంది. యంగ్ గా కనిపించేలా చేస్తుంది.. ఇక దీనిలో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండటం వల్ల మెదడు, నరాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మల మద్దకపు నివారణలో, క్యాన్సర్ రాకుండా చూడటంలో సహాయకారిగా పనిచేస్తుంది.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..