Leading News Portal in Telugu

Weight Loss Tips : ప్రతిరోజు పరగడుపున ఈ డ్రింక్స్ తాగితే.. కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది..


ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరిగినంత సులువుగా బరువు తగ్గడం కష్టం.. అధిక బరువుతో అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అధిక బరువు అయితే తగ్గించుకోవడానికి చాలా మంది వర్కౌట్ చేస్తున్న వ్యాయామం చేస్తున్న ఫలితం కనిపించడం లేదు అని అంటూ ఉంటారు.. అలాంటి వారికోసం చిటికెలో బరువును తగ్గించే సూపర్ డ్రింక్స్ ను మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో.. ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం..

ముఖ్యంగా చాలామంది సిజేరియన్స్ తరువాత వచ్చే పొట్టను కానీ డెలివరీ తర్వాత బరువు పెరిగాము బాధపడుతూ ఉంటారు కదా.. అలాంటి వారందరికీ ఈరోజు చెప్పబోయే ఈ డ్రింక్స్ తాగారంటే మీ అధిక బరువుకి చెక్ పెట్టడం ఖాయం.. వీటిని తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా దూరం దూరమవుతాయి..

*. గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో కొవ్వుని కరిగిస్తుంది. ఈ గ్రీన్ టీ తాగడం వలన చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ది బెస్ట్ డైట్ టి అని చెప్తూ ఉంటారు వైద్య నిపుణులు.. ఈ గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.. దాంతో బరువును త్వరగా తగ్గవచ్చు..

*. వాము నీళ్లు.. వాము రెండు చెంచాలు తీసుకొని అర లీటర్ నీటిలో రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని పరిగడుపున తాగినట్లయితే ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు…

*. సోంపు మన ఆరోగ్యానికి చాలా మంచిది.. ఈ సోంపుని రెండు చెంచాలు తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే తీసుకోవాలి.. ఇలా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా జీర్ణ సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది..

*. జీలకర్ర నీళ్లు..ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం.. దీనిని వాడడం వలన శరీరంలో జీవక్రియ పెరగడమే కాకుండా అనవసరమైన కొవ్వు ని కూడా కరిగిస్తుంది. జీలకర్ర మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.. అర లీటర్ నీటిలో రెండు చెంచాల జీలకర్రను వేసి రాత్రంతా నానబెట్టి మరునాడు ఆ నీటిని వడకట్టి త్రాగాలి. అధిక బరువుకు వెంటనే చెక్ పెట్టొచ్చు..