ఫ్రైడ్ రైస్ లు, బిరియానీలు, జంక్ ఫుడ్స్ లను స్పైసిగా తీసుకోవాలని అనుకుంటారు.. కొందరు మంటను తగ్గించడానికి కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు.. ఇక ఫుడ్ వ్యాపారులు కూడా నిమ్మకాయ, ఉల్లిపాయలు ఇస్తారు.. ఇది ఆహారం రుచిని పెంచుతుంది. కానీ కొన్ని ఆహార పదార్థాలతో నిమ్మరసం కలపకూడదని నిపుణులు అంటున్నారు.. వాటిలో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం..
నిమ్మకాయను పోషకాల నిల్వగా చెప్పవచ్చు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో ప్రొటీన్, కొవ్వు, విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి…నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది.. అందుకే రోజు నిమ్మరసం ఏదొక రూపంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కలిపి నిమ్మరసం ను అస్సలు తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.. జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి ఆహారం రుచి పాడు చేస్తుందని అంటున్నారు. అందుకే నిమ్మకాయతో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఒకసారి చూడండి..
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసం పాల ఉత్పత్తులతో కలిపితే, అది స్పందించి చెడిపోతుంది. అంతేకాకుండా, ఈ రెండింటిని తీసుకోవడం వల్ల యాసిడ్ రియాక్షన్ వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు..
ఈ కాయాలు ఆమ్ల గుణాలను కలిగి ఉంటుంది, ఇది మసాలా ఆహారాల వేడిని తీవ్రతరం చేస్తుంది. స్పైసీ ఫుడ్‌లో నిమ్మరసం జోడించడం వల్ల స్పైసీగా మారుతుంది.. అది ఇంకా ప్రమాదం.. అలాగే పైనాపిల్, పుచ్చకాయ, జామ, మామిడి, నిమ్మరసం కలిపి తింటే వాటి రుచి పాడు చేస్తుంది.. లేని పోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి… సో వీటిలో తీసుకొనే ముందు కాస్త ఆలోచించండి..