Leading News Portal in Telugu

health tips : నీళ్లు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పు చెయ్యకండి..


Health: ఈ భూమి మీద ప్రతి జీవికి నీరు అనేది అవసరం. నీరు లేకుండా ఏ ప్రాణి బ్రతక లేదు. అందుకే నీరుకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరు. మనలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్న.. మనం ఆరోగ్యంగా ఉండాలన్న రోజు తగినంత నీరు తాగాలి. అందుకే వైద్యులు కూడా మంచి నీరు ఎక్కువగా తాగాలి అని సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని మోతాదుకు మించి తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు నిపుణులు. అలానే నీళ్లు తాగే సమయంలో చేసే చిన్న చిన్న తప్ప్పుల కారణంగా కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Dry Coconut : ఎండు కొబ్బ‌రిని రోజు తినవచ్చా..?

నీళ్లను ఎప్పుడూ నిలుచోని తాగకూడదు. ఆయుర్వేదం ప్రకారం నీళ్ళని కూర్చొనే తాగాలి. అలానే నీళ్ళని వేగంగా తాగకూడదు. నిదానంగా తాగాలి. ఆహరం తీసుకునే అరగంట ముందు నీళ్లు తాగాలి. ఆహారం తిన్న అరగంట తర్వాత మళ్ళీ నీళ్లు తాగాలి. ప్రతి ఒక్కరు రోజుకి 8 నుండి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని కావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే హైపోనాట్రేమియా అనే సమస్య వస్తుంది. దీనినే వాటర్ ఇంటాక్సికాషన్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవాళ్లలో సోడియం స్థాయిలు పడిపోతాయి. దీని కారణంగా బ్రెయిన్ స్వెల్ అవుతుంది. చివరకి కోమా లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.