మారుతున్న కాలం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. సరైన పోషకాలు ఆహారం లేకపోవడంతో పాటు, వేళకు నిద్రపోవడం కూడా చెయ్యడం లేదు జనాలు.. అర్ధరాత్రి వరకు టీవీ, లేదా మొబైల్స్ ను చూస్తూ నిద్రపోకుండా ఉంటారు.. ఇక ఆ తర్వాత నిద్రతేలిపోతుంది.. దాంతో ఎక్కువ మంది నిద్రలేమి సమస్యలతో భాధపడుతున్నారు.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం మీ అలవాటు మీకు హాని కలిగిస్తుంది. వయసును కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట మేల్కొని ఉండడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక వ్యక్తి మరణానికి కారణం కావచ్చు.. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండడం వల్ల కలిగే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ నిద్ర వల్ల కూడా ఊబకాయం వేధిస్తుంది. తక్కువ నిద్ర కారణంగా, ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరగడం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే, అతను స్థూలకాయాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
సాదారణంగా ఒక వ్యక్తి అర్థరాత్రి వరకు మెలకువగా ఉంటే, విశ్రాంతి లేకపోవడం గుండెపై ఒత్తిడి పడుతుంది. అర్థరాత్రి వరకు మేల్కోని ఉండటం వల్ల హైబీపీ వచ్చే అవకాశం ఉంది.
టైమ్ కు నిద్రపోకుండా ఆలస్యంగా నిద్రపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి.. ఆలస్యంగా నిద్రపోతే అతని మెదడుకు సరైన విశ్రాంతి లభించదు. ఇది మనస్సుపై ప్రభావం చూపుతుంది, అటువంటి పరిస్థితిలో మతిమరుపు ప్రమాదం పెరుగుతుంది…
ఇకపోతే చాలామంది రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోతారు. లేదంటే తరచుగా టీ లేదా కాఫీ తాగుతారు లేదా జంక్ ఫుడ్స్ తింటారు. ఈ అలవాటు మిమ్మల్ని డయాబెటిస్ పేషెంట్‌గా మార్చగలదు.. అంతేకాదు చర్మ, జుట్టు సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సో జాగ్రత్త..