Leading News Portal in Telugu

Vegetarian: శాకాహారులుగా ఉండటానికి మన డీఎన్ఏ కారణమా..?


Vegetarian: ప్రపంచం మొత్తంలో మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు చాలా తక్కువ. కొంతమంది తమ ఆరోగ్యం కోసం మాంసాహారాన్ని వదిలేసి వెజిటేరియన్స్‌గా మారుతుంటారు. అయితే శాకాహారులుగా ఉండేందుకు మన డీఎన్ఏలోని జన్యువులు కూడా కారణమవుతాయంటే ఆశ్చర్యకలగక మానదు. తాజాగా ఓ స్టడీలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. PLOS వన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఒక వ్యక్తి శాకాహారానికి కట్టుబడి ఉండటానికి 4 జన్యువులు కారణమవుతున్నాయని వెల్లడించింది. శాకాహారులుగా ఉండటానికి జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ స్టడీ ప్రధాన రచయిత నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నబీల్ యాసీన్ అన్నారు.

సాధారణం కొన్ని మతపరమైన కట్టుబాట్లు, సాంస్కృతిక పద్దతులు, ఆరోగ్యం కోసం, పర్యావరణ ప్రేరణ కోసం కొంతమంది శాకాహారం వైపు వెళ్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రేరణకు కూడా భంగం వాటిల్లుతుంది. శాకాహారులని చెప్పుకుననే వారు కూడా కొన్ని సందర్భాల్లో మాంసం తినడానికి అంగీకరిస్తున్నారు. వెజిటేరియన్స్ గా ఉండాలనుకునే వ్యక్తులు అలా చేయలేకపోతున్నారని, దీనికి జన్యువులతో సంబంధం ఉందని తమ దగ్గర ఉన్న డేటా సూచిస్తోందని యాసీన్ అన్నారు.

అయితే ఈ అధ్యయనం జన్యువుల పాత్ర నిర్థిష్టంగా గుర్తించకున్నా, భవిష్యత్తులో పరిశోధలకు ఉపయోగపడుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. యూకే బయో బ్యాంకు నుంచి డేటాను సంగ్రహించి, 5000 మంది కఠిన శాకాహరులను, 3 లక్షల మంది మాంసాహారులతో పోల్చి చూశారు పరిశోధకులు. వారి విశ్లేషణలో మూడు జన్యువులు, శాకాహారులతో ముడిపడి ఉన్నట్లు, ఇక ఆహార ఎంపికలో 31 జన్యువులు అనుసంధానించబడినట్లు గుర్తించారు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో ఈ జన్యువులు భిన్నమైన వైరుధ్యాలను కలిగి ఉన్నట్టు కనుగొన్నారు.

ఈ జన్యుపరమైన వ్యత్యాసాలకు వ్యక్తుల లిపిడ్లు లేదా కొవ్వుల మెటాబాలిజంపై కారణం కావచ్చు.. శాకాహారానికి సంబంధించిన అనేక జన్యువులు లిపిడ్ జీవక్రియలో పాల్గొంటాయని డాక్టర్ యాసీన్ చెప్పారు. మొక్కుల, మాంసం ప్రత్యేకమైన లిపిడ్ కూర్పును కలిగి ఉంటాయి. కొంతమంది వ్యక్తులు జన్యుపరంగా మాంసంలోని లిపిడ్లు అవసరమ్యే అవకాశం ఉంది. లిపిడ్ జీవక్రియలో జన్యువైవిధ్యం మెదడు పనితీరును ఎలా ప్రభావితం చేస్తుందో అణ్వేషించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని యాసీన్ అన్నారు.