ఆయుర్వేదంలో తులసికి ఒకస్థానం ఉంది.. తులసిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. పొడి దగ్గును, జలుబును తగ్గించడంలో మంచిగా పని చేస్తుంది.. మనలో చాలా మంది పొడిదగ్గు రాగానే టాబ్లెట్స్ టానిక్ అంటూ వాటి వైపు వెళ్ళి పోతూ ఉంటారు. అయితే మందుల జోలికి వెళ్లకుండా ఇంటిలో ఉండే తులసి ఆకులతో చెక్ పెట్టవచ్చు. తులసి ఆకులతో తయారుచేసిన టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. అయితే తులసి టీ ని ఎలా తయారు చేయాలో చూద్దాం..
గుప్పెడు తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి.. ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టి, తులసి ఆకులు, చిన్న అల్లం ముక్క, 2 మిరియాలు పొడి చేసి వేయాలి. బాగా మరిగించి వడకట్టి తాగాలి.. ఇలా రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు..
ఈ టీ తాగడం వలన డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.అలాగే డిప్రెషన్, ఒత్తడి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలను నివారించడంలోనూ తులసి టీ మంచి మెడిసిన్ లాగా పని చేస్తుంది..
ఇలాంటి చిన్న చిన్న సమస్యలను సహజసిద్దంగా దొరికే వీటిని ఉపయోగించి సులభంగా తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవచ్చు..
అంతేకాదు ఈ తులసితో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.. ఇక జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది..