
జీలకర్ర వంటల్లో సువాసన రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడడానికి బదులుగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజు ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా జీలకర్ర నీరు మనకు సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల అజీర్తి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి చాలాసులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది.. బరువును కూడా తగ్గవచ్చు.. అలాగే జుట్టు సమస్యలు కూడా నయం అవుతాయి..
శరీరంలో ఉన్న కొవ్వు తొలగిపోతుంది. మనం సులభంగా బరువు తగ్గవచ్చు. జీలకర్ర రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమస్యలు తగ్గుతాయి. హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది.. ఈ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే.. స్టవ్ మీద ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచి వడకట్టి గ్లాస్ లో పోసుకోవాలి. ఇందులో రుచి కొరుకు నిమ్మరసం, తేనె కూడా వేసుకోవచ్చు.. రుచితో పాటుగా మంచి ఆరోగ్యం కూడా..