
ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానీకరం అని నిపుణులు చెబుతూనే ఉన్నారు.. ఎవరెన్ని చెప్పినా ఎమౌతుంది అయినప్పుడు చూద్దాంలే అని కొందరు పెడచెవిన పెట్టి ప్లాస్టిక్ వస్తువులను వాడుతూనే ఉన్నారు.. ఇక ఆహార పదార్థాల మాట పక్కన పెడితే తాగే నీరు కూడా ప్లాస్టిక్ క్యాన్ లోవే తాగుతున్నారు.. అత్యాధునిక సాంకేతికత యుగంలో తాగునీటి అవసరాలకోసం 20 లీటర్ వాటర్ క్యాన్ లపై గ్రామస్ధాయి నుండి పట్టణస్ధాయి వరకు ప్రజలు అధారపడుతున్నారు.. అలాంటి వారిని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. వాటర్ క్యాన్ల నీరు తాగడం అన్నది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా ముప్పు కలిగే ప్రమాదముందన్న ఆంళోన వ్యక్తమౌతుంది..
ప్లాస్టిక్ శతాబ్దాలుగా విచ్ఛిన్నం కాకుండా ఉండే లక్షణం కలిగి ఉండటం వల్ల పర్యావరణానికి హానికరంగా మారింది. నీటి నిల్వ కోసం ఉపయోగిస్తున్న ఈ కంటైనర్లను పాతవిగా మారటం వల్ల వ్యర్ధాలుగా పారేస్తున్నారు.. ఇది కాలుష్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు..
ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని హానికరమైన దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు కారణమవుతాయి. నీటి నుండి ఈరసాయనాలు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. వాటర్ క్యాన్లు ఎక్కువసేపు సూర్యరశ్మికి గురైనప్పుడు ఈ రసాయనాలు నీటిలో కలుస్తాయి.. అవి తాగితే ఇక ఆరోగ్యం గాడిన పడ్డట్లే..
ప్లాస్టిక్ వాటర్ క్యాన్ల నుండి నీరు తాగడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్ధకు భంగం కలిగిస్తాయి..
ఇక ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో థాలేట్స్ అనే రసాయనం ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిలోని నీటిని తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ ,స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. క్యాన్సర్ కు కారణమవుతుంది..
ఇది ఈస్ట్రోజెన్ పై ప్రభావాన్ని చూపిస్తుంది. మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికలలో యుక్తవయస్సులో అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అందుకే ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం, త్రాగడం మానుకోవడం మంచిది.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి.. సో జాగ్రత్త..