Leading News Portal in Telugu

Health Tips: నానబెట్టిన అంజీరాలను ఉదయాన్నే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?


Health Tips: నానబెట్టిన అంజీరాలను ఉదయాన్నే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

అంజీరాలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకుంటారు.. పచ్చిగా ఉన్నవాటిని తీసుకోవడం కన్నా డ్రై అంజీరాను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. డ్రై అంజీరాలను రాత్రి నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంజీర్ లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఇవి ఎంతో దోహదపడతాయి. వైద్యులు కూడా అంజీర్ ను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. అంజీర్ లను చాలా మంది నేరుగా తింటూఉంటారు.. అలా కాకుండా అంజీరాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువగా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

ఈ నీటిని తయారు చెయ్యడం కోసం ముందుగా గిన్నెలో 2 లేదా 3 అంజీర్ లను తీసుకుని అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత వీటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ అంజీర్ లను తిని పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా అంజీర్ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి.. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రేగులల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అంజీర్ నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది..

ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి…అంతేకాకుండా శరీరానికి కావలసిన ఐరన్ దొరుకుతుంది..రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా అంజీర్ నీటిని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి.. చర్మ సమస్యలు కూడా తగ్గిపోతాయి.. ఇంకా అలసట ఉండదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..