Leading News Portal in Telugu

Health Tips : ఈ టీని రోజుకు కప్పు తాగితే చాలు..ఆ సమస్యలన్నీ మాయం..


Health Tips : ఈ టీని రోజుకు కప్పు తాగితే చాలు..ఆ సమస్యలన్నీ మాయం..

భారతీయులు ఎక్కువగా వాడుతున్న మసాలా దినుసుల్లో యాలకలు కూడా ఒకటి.. వంటకు రుచిని, సువాసనను పెంచడం తో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుసుస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి యాలకలతో టీ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చునని చెబుతున్నారు.. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..

యాలకుల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదల ను అడ్డుకుంటాయి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. యాలకులను ప్రకృతి వైద్యంలోనూ విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిని క్యాన్సర్ చికిత్సకు వాడుతుంటారు.. డయాబెటిస్‌ ను సమర్థవంతంగా నియంత్రించడంలో యాలకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఉదయం యాలకులతో చేసిన టీ తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి.. ఇలా రోజూ ఒక కప్పు తాగితే షుగర్ ను కంట్రోల్ చెయ్యవచ్చు..

ఇకపోతే యాలకులు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. యాలకుల టీని తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తాయి. ఇంకా ఉదర సమస్యలను తగ్గించడం తో పాటుగా వీరేచనాలు కూడా తగ్గుతాయి.. టీని రోజూ తాగితే బీపీ తగ్గుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.. ఇక ఈ టీని తాగితే నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..