
ఏజ్ పెరిగే కొద్ది ఎవరికైనా, చర్మంపై ముడతలు రావడం కామన్.. గీతలు, మచ్చలు కూడా చర్మం పై రావడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఈరోజుల్లో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు రావడం చూస్తూనే ఉంటాం.. ఒత్తిడి, చెడు ఆహారం అలవాట్లు, నిశ్చల జీవనశైలి, కాలుష్యం వంటి కారణాల వల్ల 30 దాటక ముందే.. ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాల కారణంగానూ చిన్నవయస్సులోనే చర్మంపై ముడతలు, గీతలు పడుతున్నాయి.. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ముడతలు త్వరగా వస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..
సాసేజ్‌లు, పెప్పరోనిస్, హాట్ డాగ్‌లు వంటి ప్రాసెస్ చేసి మాంసాల్లో సోడియం సల్ఫైట్, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే.. చర్మం డీహైడ్రేట్ అవుతుంది, కొల్లాజెన్‌ను బలహీనపరుస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసాలు ఎక్కువగా తింటే.. స్కిన్ ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.. వీటిని ఎప్పుడో ఒకరిసారి తీసుకుంటే మంచిదే కానీ ఇలా వారానికి రెండు, మూడు సార్లు తీసుకుంటే ప్రమాదం..
కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ వంటి హై కెఫిన్ డ్రింక్స్‌ను చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, కెఫిన్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే.. చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయ. బయాలిస్టాక్‌లోని మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, కెఫీన్ కొల్లాజెన్ సంశ్లేషణను తగ్గిస్తుంది.. చిన్నవయస్సులోనే వృద్దాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంటుంది..
చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. గ్లైకేషన్‌కు దారి తీస్తుంది. ఈ ప్రక్రియలో చక్కెరలు ప్రోటీన్‌లతో కలిసి.. అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే హానికరమైన అణువులను ఏర్పరుస్తాయి. AGEలు కొల్లాజెన్, ఎలాస్టిన్‌ను దెబ్బతీస్తాయి. దీని కారణంగా.. చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ వస్తాయని చెబుతున్నారు..
ఆల్కహాల్ ఎక్కవగా తీసుకుంటే.. వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీని కారణంగా చర్మం పొడిబారడం, ముడతలు పడటం వంటి జరుగుతుంటాయి.. అందుకే వీటిని నిత్యం తీసుకోకూడదు అని చెబుతున్నారు.. రెడ్ వైన్ ను ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మంచిది..
జంక్ ఫుడ్స్‌ను హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేస్తారు. వెజిటబల్ ఆయిల్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ మన ఆరోగ్యం, చర్మంపై హానికరమైన ప్రభావాలను చూపుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడమే కాదు.. వీటిని తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది.. వృద్ధాప్య ఛాయలు చిన్నవయస్సులోనే వస్తాయి.. ఇప్పుడు చెప్పిన ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది.. గుర్తుంచుకోండి మిత్రమా..