Leading News Portal in Telugu

Dragon fruit: ఈ పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..!


Dragon fruit: ఈ పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..!

డ్రాగన్ ఫ్రూట్.. ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. తింటే కూడా ఆరోగ్యంగా ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్ కొందరికి తెలియకపోయినప్పటికీ.. ఇది తిన్నారంటే శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలోనూ కూడా ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పండ్లకు మార్కెట్ లో ధర ఎక్కువగానే ఉంటుంది. ఈ ఫ్రూట్ ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో ఉండే కొన్ని వ్యాధులను నయం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యువత ఈ పండును బాగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి కావల్సిన అన్నిరకాల పోషకాలను ఇది కలిగివుంటుంది. వారానికి ఒక్కసారైనా తింటే మంచి ఫలితాలు పొందుతారు. దీనితో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

Mahua Moitra: చిక్కుల్లో ఎంపీ మహువా మోయిత్రా.. వివాదానికి దూరంగా తృణమూల్..

చర్మం కాంతివంతంగా మారుతుంది
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది. అంతేకాకుండా చర్మ సంరక్షణలో ముఖానికి సహజసిద్ధమైన మెరుపునిస్తుంది.

గుండెకు ఎంతో మేలు
ఈ పండును తినడంవల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు దీన్ని తినడం వల్ల చాలా మంచిది.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది
శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది
డ్రాగన్ ఫ్రూట్ ను వారానికి రెండుసార్లు తినడంవల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా.. జుట్టు మెరుపును కూడా పెంచుతుంది. అల్జీమర్స్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

షుగర్, క్యాన్సర్ ను నియంత్రిస్తుంది
దీనిలో ఫైబర్ ఉంటుంది. అందువల్ల షుగరును నియంత్రిస్తుంది. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు దీన్ని తింటే ఎంతో చురుగ్గా ఉంటారు. అంతేకాకుండా డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ రాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది.

ఎముకలకు బలం
ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని అందించి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
ఈ ఫ్రూట్ తినడం వల్ల జుట్టు రాలిపోవడం, గుండె దడ, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ ఎంతో తోడ్పడుతుంది.