
కొబ్బరి నూనె గురించి మనందరి తెలుసు.. చర్మ, జుట్టు సంరక్షణలోప్రముఖ వహిస్తుంది.. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొబ్బరి నూనె వల్ల ఆరోగ్యానికి కుడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. కొబ్బరి నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరినూనెలో ఐరన్, జింక్, విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కొంతమంది వంటలకు కొబ్బరినూనెను వాడుతుంటారు. కేరళలో వంటలకు కేవలం కొబ్బరి నూనె మాత్రమే వాడుతూ ఉంటారు. ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి .
ఇకపోతే షుగర్ పేషంట్స్ కు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండెకు సంబందించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.. కిడ్నీలో రాళ్ల సమస్య కూడా తొలగిపోతుంది ఈ విధంగా పరగడుపున కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల పగుళ్ళు,ముడతలు తగ్గి చర్మం మృదువుగా యవ్వనంగా ఉంటుంది. రోజు వంటలకు మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక పాదాలకు కూడా కొబ్బరి నూనెను రాత్రి పాడుకొనే ముందు రాసుకొని పడుకుంటే పాదాలు మృదువుగా మారతాయి.. జుట్టు, చర్మ సమస్యలు దూరం అవుతాయి.. వచ్చేది చలికాలం కాబట్టి కొబ్బరి నూనెను వాడటం మర్చిపోకండి..