Leading News Portal in Telugu

Health Tips: ఈ ఆకుకూరను మగవాళ్లు తింటే ఎంత ప్రయోజనం తెలుసా..!


Health Tips: ఈ ఆకుకూరను మగవాళ్లు తింటే ఎంత ప్రయోజనం తెలుసా..!

ఆకుకూరలు తింటే అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికి తెలుసు. ఆకుకూరలు రోజు తింటే అనేక అనారోగ్య సమస్యల బారినుంచి తప్పించుకోవచ్చు. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఆకు కూరలు తినాలని సూచిస్తారు. అయితే ఆకుకూరల అన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల రకమైన పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. ఇవి ఎక్కువగా పురుషులకు ఎంతో సహాయపడుతాయి. ఈ ఆకుకూరతో పలు రకాల సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పొన్నగంటి ఆకులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇందులో బి6, సి, ఏ విటమిన్లతో పాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ ఆకుకూర తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది. అంతేకాకుండా గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. పొన్నగంటి కూరలో ఎముకల ఎదుగుదలకు లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటివాటిని కూడా ఈ ఆకు కూర దూరం చేస్తుంది. బరువును నియంత్రణ, క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది.

పొన్నగంటి కూర తినడం ద్వారా మగవారికి కావల్సిన శక్తి సమకూరుతుంది. ఇందులో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూర జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. పొన్నగంటి కూర ఒక టేబుల్ స్పూన్ రసాన్ని వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలింగా వేధించే దగ్గు, ఆస్తమా ఇక ఉండదు. అంతేకాకుండా.. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ ఆకు కూర తినడం వల్ల సన్నగా ఉండేవారు బరువు పెరుగుతారు. కందిపప్పు, నెయ్యితో కూరను వండుకోవాలి. అంతేకాకుండా పొన్నగంటి ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తింటే బరువు తగ్గుతారు. కంటి కలకలు, కురుపులు కూడా దీనితో చెక్ పెట్టవచ్చు. పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్లమీద కొంచెం సమయం ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా.. వెన్ను నొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. నరాల్లో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది.