Leading News Portal in Telugu

Health Tips : బాదాంను రోజూ తింటున్నారా? ఆ ప్రమాదాలు ఉన్నాయని తెలుసా?


Health Tips : బాదాంను రోజూ తింటున్నారా? ఆ ప్రమాదాలు ఉన్నాయని తెలుసా?

డ్రై ఫ్రూట్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం బాదం పప్పు.. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి.. రుచిగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.. రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తీసుకుంటారు.. బాదం మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేచేస్తుంది.. ఎన్నో పోషకాలు ఉన్నాయి.. జింక్, క్యాల్షియం, విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రోటీన్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. బాదంపప్పును తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అతిగా వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్లశరీరంలో విటమిన్ ఇ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ కొన్నిసార్లు విషంగా కూడా మారవచ్చు. శరీరంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రక్తస్రావం ఎక్కువవుతుంది.. ఇంకా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.. ఇకపోతే తక్కువ తీసుకుంటే బరువు తగ్గుతారు అదే ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు..

బాదంలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. బాదంపప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలోకి అధిక క్యాలరీలు చేరుతాయి. దీంతో బరువు పెరుగుతారు. అంతేకాకుండా బాదంపప్పులో ఆక్సలైట్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ ఎక్కువగాఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించదు.. అందుకే ఆరోగ్యానికి మంచిదని అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. జాగ్రత్త..