Leading News Portal in Telugu

Lifestyle : మగాళ్లు భార్యలకు కూడా చెప్పలేని విషయాలేంటో తెలుసా?


Lifestyle : మగాళ్లు భార్యలకు కూడా చెప్పలేని విషయాలేంటో తెలుసా?

ఆడవాళ్లకు మాత్రమె కోరికలు ఉంటాయంటే అది తప్పే.. మగ వాళ్లకు కూడా కొన్ని ఫీలింగ్స్, ఎన్నో చెప్పుకోలేని కోరికలు ఉంటాయి.. అందరు మగవాళ్ళు ఒకేలా ఉండరు..వారిలో కూడా చాలా లోతు ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో చాలా పొరలు ఉంటాయి. దాని కింద భావోద్వేగాలు, కోరికలను అణిచిపెట్టి ఉంటారు. అబ్బాయిలు కూడా రహస్యాలను దాచిపెట్టగలరని చాలా మంది లేడీస్‌కు తెలియదు. కొందరు మగవాళ్ళు తమ భార్యలకు కూడా చెప్పలేని కొన్ని విషయాలు ఉంటాయట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఏదైనా జరిగితే నన్ను కాపాడు.. నాకు నీ సపోర్ట్ కావాలని మహిళలు అడిగినట్లుగా పురుషులు అడగరు, అడగలేరు. కానీ వారికి ఆ అవసరం ఉంటుంది. తమను ఎవరైనా ప్రేమించాలని, కష్ట సమయాల్లో వారికి మద్దతు ఇవ్వాలని, ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయం చేయాలని వారు కూడా కోరుకుంటారు. కానీ నోరు తెరిచి అడగలేరు. జీవిత భాగస్వామికి కూడా ఈ విషయం చెప్పరు.భయాన్ని, బాధను బలహీనతగా అనుకోవడం వల్ల చాలా మంది పురుషులు వాటిని బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు. భయం గురించి చెప్పినా, బాధ పడుతున్నామని ఎవరికైనా తెలిస్తే చులకన అయిపోతామని, హేలన చేస్తారన్న భయం వారిని భావోద్వేగాల గురించి చెప్పకుండా చేస్తుంది.. ఎవరైనా దగ్గరి వ్యక్తులు, సన్నిహితులు, ప్రియమైన వారు, కుటుంబసభ్యులను కోల్పోతే ఆ బాధను కూడా దిగమింగుకుంటారు.. కానీ బాధను పైకి చెప్పరు.. ముఖ్యంగా ఏడవరు.. లోలోపల దాని గురించి బాధ పడతారు..

ఎప్పుడైన ఆడవాళ్లు లాగా చిన్న విషయాలను పట్టించుకోరు.. బంధువుల మధ్య జరిగిన చిన్న సమస్యలను కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాటిని చాలా లైట్‌గా తీసుకుంటారు. అయితే ఈ వైఖరి కొన్నిసార్లు వారి సంబంధాన్ని సంతోషంగా ఉంచుతుంది. మరి కొన్నిసార్లు ఈ అజాగ్రత్తే పెద్ద గొడవలకు కారణం అవుతుంది.అందుకే మగవాళ్ళు కొన్ని చెప్పరు..చాలా క్లోజ్ అయితే తప్ప..ఏది ఏమైనా మగవాళ్ళు కఠినమైన వాళ్ళే.. కొన్ని విషయాల్లో మాత్రమే సుమా..