Leading News Portal in Telugu

Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?


Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

చిలగడదుంప తియ్యగా ఉంటాయి.. వీటిని చిన్నా, పెద్ద అందరు ఇష్టంగా తింటారు.. అయితే ఇవి ఎక్కువగా చలికాలంలోనే లభిస్తాయి.. చాలా రుచికరమైన, పోషక విలువలు కలిగినది. చలికాలంలో చిలగడదుంప తినడం మంచిది. ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో మన చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలికాలంలో చర్మం త్వరగా డ్రై అవుతుంది. ఇలాంటప్పుడు మన చర్మం పాడైపోతుంది.. చిలగడదుపం తినడం చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ముడతలు పడిన, వృద్ధాప్య చర్మం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తుంది.. చర్మాన్ని గరుకుగా కాకుండా మృదువుగా, తేమను కోల్పోకుండా ఉంచుతుంది..

ఇక చలికి బయటకు రాకూడదనే మనస్తత్వం ఉన్నవారే అందరు. అటువంటప్పుడు, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడే మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉండే చిలగడదుంపను తీసుకోవడం చాలా మంచిది.. సాధారణంగా వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. చిలగడదుంపను తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. సహజ చక్కెర కంటెంట్‌తో కూడిన చిలగడదుంప శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తుంది. పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దీనితో శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మేలు జరుగుతుంది..

అంతేకాదు వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది.. ఇందులో బీటా -కెరోటిన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.. అలాగే క్యాన్సర్ ను నయం చెయ్యగలిగే శక్తిని కలిగి ఉంటాయి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..