
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అధిక బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అలాంటివారికి గుమ్మడి కాయ జ్యూస్ భేష్ అని నిపుణులు చెబుతున్నారు.. ఆ జ్యూస్ ను ఎలా తీసుకుంటే మంచి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సాదారణంగా బూడిద గుమ్మడికాయ లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది.. దాంతో బరువును కంట్రోల్లో ఉంచుతుంది.. విటమిన్ B3 ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరానికి శక్తినిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది..
ఒక గుమ్మడి కాయను తీసుకొని చెక్కు తీసి, మిక్సీలో వేసి మెత్తగా జ్యూస్ చేసుకోవాలి.. దానికి నిమ్మరసం కలపండి. తర్వాత ఈ రెండు మిశ్రమాల ను బాగా కలపాలి. ఈ జ్యూస్‌ని వారానికి రెండు సార్లు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.. ఈ జ్యూస్ ను పరగడుపున మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బూడిద గుమ్మడి కాయ రసం తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం సమస్య దూరమవుతుంది.. మెదడు పని తీరును కూడా మెరుగుపరిస్తుంది.. చర్మ, జుట్టు సమస్యల నుంచి బయట పడవచ్చు.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది..