Leading News Portal in Telugu

Spicy Foods : కారం ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీ ప్రాణాలు డేంజర్లో ఉన్నట్లే..


Spicy Foods : కారం ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీ ప్రాణాలు డేంజర్లో ఉన్నట్లే..

పుర్రెకో బుద్ధి, జిహ్వ‌కో రుచి అన్నారు పెద్దలు.. అంటే ఒక్కో మనిషికి ఒక్కో బుద్ది ఉన్నట్లే.. ఒక్కో నాలుక ఒక్కో రుచిని కోరుకుంటుంది.. ఎవరికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు ఆస్వాదిస్తారు.. ఎక్కువ మంది కారంను ఎక్కువగా తింటారు.. మనం దేశంలో మిర్చి ఘాటు లేకుండా అస్సలు నోటికి అస్సలు రుచించదు..పప్పు నుంచి మొదలుకుని అన్ని రకాల కూరలకు వరకు కారం తగలాల్సిందే.. మిరపకాయల కారంతో అన్ని రకాల వంటకాలను చేయడానికి ఇష్టపడతాము. ఏది లేకపోయిన మన వంటగదిలో కారం ఉండాల్సిందే. మిరపకాయలను బట్టి.. పొడిని మితంగా ఉపయోగిస్తారు.. అయితే కారం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. కారంను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

స్పైసీ ఫుడ్‌లో ఎక్కువ ఉప్పు, మసాలాలు ఉంటాయి. దీని కారణంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. మీరు ఇప్పటికే అధిక బీపి ఉన్న రోగి అయితే మిరపకాయలు.. మసాలాలు తీసుకోవడం తగ్గించండి.. లేదంటే మాత్రం మీరు ప్రమాదంలో పడ్డట్లే..

కారంను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మంలోని తేమ తగ్గి, పొడిబారడంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి మిరపకాయలు, మసాలాలు పరిమిత పరిమాణంలో మాత్రమే తినడం మంచిది..

ఇకపోతే మసాలా ఆహారాన్ని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల బరువు పెరుగుతారు. దీనికి కారణం ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉండటమే.. తిన్న తర్వాత కూడా మీకు మరింత ఆకలిగా అనిపిస్తుంది. దీంతో బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది..

ఎక్కువ కారం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మంలోని తేమ తగ్గి, పొడిబారడంతోపాటు చర్మ సమస్యలు వస్తాయి.. అందుకే కొంచెం తక్కువ కారం ఉన్న వాటిని తీసుకోవడం మంచిది..

అంతేకాదండోయ్..మసాలాలు తినే వారికి పైల్స్ తరచుగా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మిర్చి ఎక్కువ ఉపయోగం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని.. అందుకే మసాలాలను తగ్గించుకోవడం బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు..