
చలికాలం వచ్చేసింది.. రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది.. చలికి చర్మం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఎంతగా జాగ్రత్తలు తీసుకున్న కూడా ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి.. చలికాలంలో చర్మ సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యలకు కొబ్బరి నూనె మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.. చలికాలంలో కొబ్బరినూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చల్లని వాతావరణంలో శరీరం మొత్తం పొడిబారుతుంది. పొడిబారిన చర్మాన్ని పోగొట్టుకోవాలంటే తలస్నానం చేసేటప్పుడు కొబ్బరినూనె వాడవచ్చు. తలస్నానం చేశాక శరీరానికి కొబ్బరినూనె రాసుకుని పైన రెండు-మూడు మగ్గుల నీళ్లు పోసుకోవాలి. దీంతో రోజంతా చర్మం మృదువుగా ఉంటుంది..
చలికి పాదాల పగుళ్ళు ఏర్పడటంతో పాటుగా పెదాలు కూడా పగులుతూ ఉంటాయి.. పెదాల సమస్యను వదిలించుకోవడానికి మీరు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. మీరు పెదవులపై కొన్ని చుక్కల కొబ్బరి నూనెను రాసుకోవచ్చు.. రోజూ రాత్రి పడుకొనే ముందు రాసుకుంటే పెదాలు మృదువుగా తయారు అవుతాయి..
జుట్టు పొడిబారడం, చుండ్రును తొలగించడానికి కొబ్బరి నూనె కూడా మంచిది. ఇందుకోసం కొబ్బరినూనెతో జుట్టుకు మసాజ్ చేయాలి. గోరువెచ్చని కొబ్బరి నూనెను తలకు పట్టించడం చాలా మంచిది..
ఇక ఈ కాలంలో మనం ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా చర్మం పగుతుంది.. అందవిహీనంగా మారుతుంది.. దాంతో కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ముఖ చర్మం మృదువుగా మెరుస్తూ ఉంటుంది. ఇది ముఖంపై మచ్చలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది..
ఈ సీజన్ లో జలుబు కూడా తరచుగా వస్తుంది.. అటువంటి పరిస్థితిలో మీరు ముక్కు పొడిబారడం వల్ల ఇబ్బంది పడుతుంటే 2-3 చుక్కల కొబ్బరి నూనెను ముక్కులో వేస్తె మీకు తక్షణ ఉపశమనం పొందవచ్చు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.