Leading News Portal in Telugu

Health Tips : చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? ఈ టిప్స్ మీ కోసమే..


Health Tips : చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నాయా? ఈ టిప్స్ మీ కోసమే..

ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులతో భాద పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, జీవనశైలిలో మార్పులు వంటి వివిధ రకాల కారణాల చేత కీళ్లనొప్పుల సమస్య తలెత్తుతుంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగానే ఉంటాయి.. ఈరోజుల్లో మనుషులు చాలా సున్నితంగా ఉంటారు.. కాస్త నొప్పి వస్తే చాలు డాక్టర్ల దగ్గరకు పరుగెడతారు.. లేదా పెయిన్ కిల్లర్ మాత్రలను ఎక్కువగా వాడుతారు.. ఈ నొప్పులకు ఇంగ్లిష్ మందులకన్నా కూడా ఇంటి చిట్కాలను వాడటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక టీ స్పూన్ తేనెను, అర టీ స్పూన్ నువ్వులను, పావు టీ స్పూన్ శొంఠి పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో తేనెను తీసుకోవాలి.. నువ్వులు, శొంఠి పొడి వేసి బాగా కలిపి పడి నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.. ఆ తర్వాత దీన్ని తినాలి.. ఇలా క్రమం తప్పకుండా 15 రోజుల పాటు తీసుకోవడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్లల్లో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. అలాగే నువ్వుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది.

ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎముకలను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్య తగ్గడంతో పాటు ఎముకలు, దంతాలు దృడంగా మారుతాయి… అంతేకాదు ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబును కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు..