Leading News Portal in Telugu

Health Tips : ఈ ఆహారాలను తినేటప్పుడు నీళ్ల తాగకూడదు.. ఎందుకో తెలుసా?



Food Eating

ఆహారాన్ని తినేటప్పుడు ఎప్పుడూ నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఏదైనా ఆహారం తినేప్పుడు.. నీళ్లు తాగడం సహజం. అయితే, కొన్ని ఆహారపదార్థాలు తినేప్పుడు.. నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలా ఆహార పదార్థాలతో నీరు తీసుకోవడం సురక్షితం కాదని అంటున్నారు, వీటి కారణంగా అజీర్ణం, అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అంటున్నారు.. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కమల, ద్రాక్షపండ్లు, బత్తాయి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు తినేప్పుడు నీళ్లు తాగితే.. కడుపు అసౌకర్యంగా ఉంటుంది, కడుపు పూర్తిగా నిండిన అనుభూతి ఉంటుంది. వాటిని మితంగా తీసుకోవడం, అవి తిన్న తర్వాత గ్యాప్‌ ఇచ్చి నీళ్లు తాగడం మంచిది…

అలాగే అరటిపండు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగడం మంచిది కాదు.. ఫైబర్ ఎక్కువగా ఉండే పండు.. నీళ్లు తాగితే కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు కరిగిపోతాయి. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తాగక పోవడమే మేలు..

మసాలాలను దిట్టంగా వేసిన ఆహారాలను, లేదా స్పైసీ ఫుడ్స్‌తో నీళ్లు ఎక్కువగా తాగితే.. అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నీరు వేడిని వ్యాపింపజేస్తుంది, మంటను మరింత తీవ్రతరం చేస్తుంది. స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు నోరు చల్లబరచడానికి పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

రైస్‌తో పాటు నీళ్లు ఎక్కువగా తాగితే.. జీర్ణక్రియకు అవసరమైన యాసిడ్స్‌ డైల్యూట్‌ అవుతాయి. అన్నం తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే.. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.. గ్యాస్ పడుతుంది..

అదే విధంగా పెరుగును తీసుకున్న తర్వాత నీళ్లు తాగితే.. ఈ ప్రోబయోటిక్స్‌ ఎఫెక్ట్‌ తగ్గుతుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. పేగుల ఆరోగ్యానికి హానికరం..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.