
చలికాలంలో చర్మం పొడిబారడం కామన్.. అయితే తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మరి చలికాలంలో చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..వీటిలో విటమిన్ బి3, నియాసిన్ శరీరంపై ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. మీకు ఆకలిని కలిగించదు..
ఇది కండరాలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, శారీరక శ్రమ తర్వాత కండరాలు కోలుకోవడానికి, మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. వేరుశెనగలో ఉండే పోషకాలు క్యాన్సర్ నుండి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.. ఒత్తిడి తగ్గిపోవటంతో పాటు తలనొప్పి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు సైతం తగ్గుతాయి..
ఫోలేట్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు..అల్జీమర్స్ బాధితులకు సైతం వేరుశనగ ప్రభావవంతమైన ఫలితాలను కలిగిస్తుంది.. ఉడికించిన వాటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.. వేరుశెనగలో మాంగనీస్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి. మీ ఆహారంలో వేరుశనగలను తరచూగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది… ఇంకా ఎన్నో సమస్యలను ఇది దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.