Leading News Portal in Telugu

Skin Care : చలికాలంలో ముఖానికి తేనేను రాస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?


Skin Care :  చలికాలంలో ముఖానికి తేనేను రాస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

చలికాలంలో చర్మం పొడిబారీ పోతుంది.. పగుళ్ళు ఏర్పడటంతో నిర్జీవంగా మారుతుంది.. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు.. కానీ అన్నిటికన్నా తేనెను వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. తేనేను ఎలా రాస్తే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తేనెను ముఖానికి రాసుకుంటే చర్మ కాంతి పెరుగుతుంది. ఇది శరీరానికి హాని చేయదు. శరీర బలాన్ని పెంచుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రాత్రిపూట ముఖానికి తేనె రాసుకుంటే చర్మం మెరుస్తుంది. మీ చర్మం రంగు క్రమంగా క్లియర్ అవుతుంది.. రోజు రాత్రి పడుకొనే ముందు ముఖంపై పేరుకున్న మురికి, ఆయిల్‌ శుభ్రపడుతుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు తొలగిపోతాయి. ముఖ సౌందర్యం పెరుగుతుంది..

పడుకోబోయే ముందు ముఖానికి తేనె రాసుకుని పడుకుంటే చర్మం పొడిబారదు. ముఖం ప్రకాశిస్తుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు మొత్తం మాయం అవుతాయి.. తేనె వల్ల పెదాలు పగిలిపోయే సమస్య ఉండదు. శరీరంలోని డ్రైనెస్ కూడా క్రమంగా మాయమవుతుంది. ప్రతిరోజు తేనెను ముఖానికి, పెదాలకు రాసుకుంటే పొడిబారడం అనే సమస్య శాశ్వతంగా పోతుంది.. కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.. ఉదయం వేడి నీటిలో ఒక స్పూన్ తేనే వేసుకొని తాగితే మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..