Leading News Portal in Telugu

Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..


Health Tips : ఈ డ్రింక్ ను ఒక్కసారి తాగితే చాలు.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

ఈ మధ్యకాలంలో అతి చిన్న వయస్సులో కూడా రక్త హీనత సమస్య వస్తుంది.. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారు.. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉంటే రక్త హీనత సమస్య పెరుగుతుంది.. రక్తహీనత కారణంగా శరీరంలో అవయవాలకు ఆక్సిజన్ సరఫరా కూడా తగ్గుతుంది. రక్తహీనత కారణంగా మనం అలసట, నీరసం, బలహీనత, తలతిరిగినట్టుగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరుచూ స్పృహ కోల్పోవడం, తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడడం వంటి వివిధ రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.. రక్త హీనత సమస్యను ఎదుర్కోవడానికి ఈ చిట్కాను పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే ఎర్ర గులాబీ రేకులు, ఒక టీ స్పూన్ సోంపు గింజలు వేసి మరిగించాలి. గులాబి రేకులు ఎండినవి లేదా తాజావైనా వాడుకోవచ్చు.. ఈ చిట్కాను పాటించడం చాలా సులభం. ఈ చిట్కాను పాటించిన 15 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చే మార్పును గమనించవచ్చు.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

ఈ నీటిని ఇలా 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా తాగాలి. ఇలా రోజూ ఉదయం పూట తాగడం వల్ల శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. చాలా త్వరగా, చాలా సులభంగా రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఇలా తయారు చేసుకున్న నీటిని రాత్రి సమయంలో తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది.. హాయిగా నిద్రపోతారు.. చర్మ సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి.. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు..