Leading News Portal in Telugu

Health Tips: గుప్పెడు పుట్నాల పప్పు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?


Health Tips: గుప్పెడు పుట్నాల పప్పు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?

పుట్నాల పప్పు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వీటిని చట్నీలు, ఫ్రై లలో వాడుతారు.. అయితే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. రోజూ ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిలో వృక్ష సంబంధిత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వేగన్ డైట్ చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ చురుకుగా పని చేసేలా చేస్తాయి.. దాంతో జీర్ణ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పుట్నాల పప్పు మనకు ఎంతో దోహదపడుతుంది..

పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది.. దాంతో ఎక్కువగా ఆహారాన్ని తీసుకోలేము.. బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.. అదే విధంగా పుట్నాల పప్పులో ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.. ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా పుట్నాల పప్పును తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.. గుండె, మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.. ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..