
ఈ మధ్య షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇది దీర్ఘ కాలిక వ్యాధి.. ఒక్కసారి వస్తే ఇక బ్రతినంత కాలం మనల్ని వదిలి పెట్టదు.. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది.. కాగా తాజాగా ఓ అధ్యయనం ప్రకారం బ్లాక్ టీ తాగేవారిలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతున్నాయని వెల్లడించింది.. బ్లాక్ టీని రోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
లక్షల మంది పై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి రక రకాల టీలను అందించారు. ఆ టీలు వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో పరిశీలించారు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలులు పెరగడం వంటి వాటిని పరిశీలించారు. మిగతా టీలతో పోలిస్తే బ్లాక్ టీ తాగే వారిలో షుగర్ వచ్చే అవకాశం తగ్గినట్టు గుర్తించారు.. సో బ్లాక్ టీ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు..
అదే విధంగా గ్రీన్ టీతో కూడా డయాబెటీస్ ను దూరం పెట్టొచ్చని వెల్లడించారు. మరొక అధ్యయనంలో 10 లక్షల మందిపై పరిశోధన చేశారు. వీరికి కొన్నేళ్ల పాటు గ్రీన్ టీ తాగమని చెప్పారు. ఈ పరిశోధనలో టైప్ 2 డయాబెటీస్ బారిన పడే అవకాశం 17 శాతం తగ్గినట్లు తెలిపారు.. రోజుకు ఒకటి, రెండు సార్లు గ్రీన్ టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మాత్రం మైదాతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.. అలాగే వ్యాయామాలు చేయడం, ఫ్రెష్ కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు వంటివి తినడం వల్ల షుగర్ రాదని చెబుతున్నారు..