
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగాలి.. అలాగే eఒక పండు తినాలని నిపుణులు చెబుతున్నారు.. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి. రోజుకు కనీసం ఒక పండు తిన్నా అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.. అందుకే ఈమధ్య ఎక్కువ మంది డైట్ పేరుతో ఉదయం, మధ్యాహ్నం పండ్లునే తింటున్నారు.. ఖాళీ కడుపుతో ఎటువంటి పండ్లను తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
బొప్పాయిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు.పండిన బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి.. వీటిలో విటమిన్స్ అధికంగా ఉంటాయి.. ఉదయం తీసుకుంటే చాలా సమస్యలకు చెక్ పెడుతుంది..
కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కివీని తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది..పొట్టలోని వ్యర్థాలను బయటకు పంపించి, పొట్టను శుభ్రం చేస్తుంది..
ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అరటిపండులో పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అరటిపండ్లు త్వరగా జీర్ణమవుతాయి.. అలాగే నీరసం లేకుండా తక్షణమే శక్తీని ఇస్తుంది..
శీతాకాలంలో నారింజ పండ్లు ఎక్కువగా లభ్యమవుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతాయి.. విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది.. అలాగే దానిమ్మ కూడా మంచిదే,. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.. ముందుగా ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల మంచి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారు.. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది..