
పొద్దున్నే లేవగానే చాలా మంది కళ్ల ముందు టీ ఉండాలని అనుకుంటారు.. గొంతులో టీ చుక్క పడితేగానీ చాలా మందికి పొద్దు పొడవదు.. అలా పరగడుపున టీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నా వినరు.. అయితే అలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. టీ తాగడానికి ఒక సమయం ఉంటుందని, అప్పుడే టీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. టీని ఎప్పుడు తాగాలో, ఎందుకు అప్పుడే తాగాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది… అందుకే కొంతమంది నీళ్లను తాగి ఆ తర్వాత టీని తాగుతుంటారు..
ఇలా టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. టీలోని టానిన్ జీర్ణవ్యవస్థ ఆహారం నుండి ఇనుమును గ్రహించకుండా నిరోధిస్తుంది.. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి..
అందుకే ఈ టీని తాగడానికి ఒక సమయం ఉందట.. అది ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీని తాగాలని నిపుణులు చెబుతున్నారు.. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మార్నింగ్ టీ కావాలంటే పంచదారకు బదులు బెల్లం లేదా దేశీ చక్కరను వాడిన అల్పాహారాన్ని తిన్న తర్వాతే టీ తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. టీ ప్రియులు ఇది మీకోసమే..