Leading News Portal in Telugu

Health Tips : చలికాలంలో తులసి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?


Health Tips : చలికాలంలో తులసి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

చలికాలంలో సీజనల్ వ్యాధులు రావడం కామన్ అందుకే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వాటి నుంచి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.అలాగే తులసి, పుదీనా, అల్లం వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి.. ఈరోజు మనం చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ,యాంటీ ఫంగల్ మొదలైన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు శారీరక సమస్యల నుంచి బయటపడేస్తుంది. తులసి ఆకులు గుండెల్లో మంట అజీర్ణం లాంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.. ఇంకా ఎన్నో సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది.. అలాగే రోజూ నాలుగు ఆకులను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..

అలాగే రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. గుండెపోటు లాంటి సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తులసి ఆకులను నిత్యం నమిలి తీసుకోవాలి. ఇలా చేస్తే అందులో ఉండే గుణాలు నోట్లోని బ్యాక్టీరియాని చంపి నోటి దుర్వాసన తగ్గిస్తాయి. తులసి ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కడుపు సమస్యలు ఉండవు. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.. చర్మ సమస్యలను, జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.. తులసి ఔషాదాల నిలయం.. ఒక్కటని కాదు ఎన్నో రోగాలకు చెక్ పెడుతుంది..రోజూ నాలుగు ఆకులు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..