
Viral News : ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల హ్యాండ్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. దాని పరిమాణం, రంగు, నాణ్యతను బట్టి వాటి ధర ఆధారపడి ఉంటుంది. చాలా మంది మహిళలు హ్యాండ్ బ్యాగుల సేకరణ హాబీని కలిగి ఉంటారు. సందర్భాన్ని బట్టి నప్పిన హ్యాండ్ బ్యాగులను వేసుకుని వెళ్తుంటారు. కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు వాడే హ్యాండ్ బ్యాగుల ధరలు చూసి సామాన్యులు షాక్ అవుతుంటారు.
ఇప్పుడు లేడీస్ బ్యాగులు రూ.500 నుంచి రూ.10 వేల వరకు సులభంగా లభిస్తున్నాయి. హ్యాండ్‌బ్యాగ్ ధర ఇక్కడితో ముగియలేదు..రాను రాను లక్షలు, కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం ఓ బ్యాగు గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. దీని పెట్టే డబ్బులు పెడితే రాజధాని ఢిల్లీలో డజన్ల కొద్ది ప్లాట్లు, ఇళ్లు కొనుక్కోవచ్చట.